అక్రమ ఇసుక రవాణాకు బ్రేకులు లేవా?

3251చూసినవారు
అక్రమ ఇసుక రవాణాకు బ్రేకులు లేవా?
మంథని నియోజకవర్గం లోని మంథని మండలం బిట్టుపల్లి శివారులో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీడ్ గా వస్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో సూరయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు, అంబేద్కర్ సంఘం నాయకులు జంజర్ల స్వామి తీవ్రంగా గాయాలపాలై కరీంనగర్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెంకల సురేష్ లు సందర్శించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథనిలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికార యంత్రంగా ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. అంబేద్కర్ సంఘం నాయకులు జంజర్ల స్వామి తన పోలం పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అతివేగంతో బస్సు ఇసుక లారీ వెనక నుండి ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయని అన్నారు. మంథని ఇసుక క్వారీల నుండి వచ్చే లారిలు అతివేగంతో ఓవర్ లోడ్ తో రావడం వల్ల, సమయపదం లేకుండా ఇసుక లారీలు నడవడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.

పలుమార్లు అనేక సంఘటనలు జరిగిన అధికారి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇసుక లారీలు నడిచే ప్రాంతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇసుక మాఫియా తమ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు వ్యవరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా సమయ పాలన లేకుండా విచ్చలవిడిగా ఇసుక ట్రాక్టర్లు రాత్రింబవళ్లు నడుస్తున్నాయని అన్నారు. ప్రజలు రోడ్డుమీద ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. తీవ్ర గాయాల పాలైన రైతు, అంబేద్కర్ సంఘ నాయకులు జంజర్ల స్వామికి మెరుగైన వైద్యం అందించి తన ప్రాణాలు కాపాడాలని, తన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఇసుక క్వారీల పై జిల్లా కలెక్టర్ ప్రతివారం సమీక్ష నిర్వహించి ప్రమాదలు జరగకుండా ప్రగడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్