బీజేపీ ప్రచార వాహనాలు ప్రారంభం

53చూసినవారు
బీజేపీ ప్రచార వాహనాలు ప్రారంభం
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వాహనాలను శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పెద్దపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ప్రభారీ నరేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్