పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈనెల 31న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా టిఎస్ జెన్ కో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ సైట్ సందర్శిస్తారని, అలాగే గోదావరిఖనిలో నిర్మించిన స్కిల్ సెంటర్ సెక్టార్ 2ను ప్రారంభిస్తారని, రామగుండం కార్పొరేషన్ లో టియూఎఫ్ఐడిసి, అమృత్ 2 నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.