తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనున్నది. ప్రభుత్వం సింగరేణిపై దృష్టి పెట్టింది. సింగరేణి ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సింగరేణిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సింగరేణిలో పని చేసే బదిలీ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పంది. 2,364 మందిని జనరల్ మర్డర్లుగా క్రమబద్ధీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.