సిరిసిల్ల పట్టణం 36వ వార్డులో శనివారం వెంకంపెట్ కు చెందిన సిరిపురం లావణ్య రవి మరియు సుందరయ్యనగర్ కు చెందిన గాజుల నరహరికి CMRF చెక్కును మొత్తం 50,000 రూపాయలు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా CMRF ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.