రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మాజీ సెస్ చైర్మన్, ప్రస్తుత సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తన సొంత ఖర్చుతో కరోనా పిచికారీ యంత్రాన్ని తన సొంత ట్రాక్టర్ కి బిగించి స్ప్రే చేయడం జరిగింది. ఈ సందర్భంగా అల్లాడి రమేష్ మాట్లాడుతూ.. ఈ యొక్క కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే మళ్ళీ హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతం దేవేంద్ర, వెంకటేశం, ఉప సర్పంచ్ సలేంద్ర లత శ్రీనివాస్, కార్యదర్శి, వార్డు మెంబర్స్, మాజీ సర్పంచ్ ఐతం అంజయ్య, ఐతం తిరుపతి, ఐతం శ్రీనివాస్, అనంతుల మోహన్ బుర్ర శ్రీనివాస్, స్వర్గ కిరణ్, కవ్వంపెల్లి కళ్యాణ్ కవ్వంపెల్లి సురేష్, బైరి హరి కృష్ణ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అల్లాడి రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.