వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచారు. దీంతో ఆలయం సందడిగా దర్శనమిస్తోంది. భక్తులకు ధర్మదర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నతాధికారు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు. కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు. స్వామివారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు