రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు కుటుంబ సమేతంగా పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల నైవేద్యాలతో పాటు పసుపు కుంకుమలను సమర్పించుకుని సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని మహిళ భక్తులు వేడుకున్నారు.