రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో కంబాల అంజయ్య అనే కౌలు రైతు ఉన్నాయి. అతను కౌలు చేస్తున్న పొలంలో విద్యుత్ వైర్లు పూర్తికి కిందికి వేలాడుతున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నాడు. పొలంలో పంట వేయాలన్నా.. ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైర్లను పైకి లేపాలని అంజయ్య కోరుతున్నారు.