వేములవాడ రాజన్న సన్నిధానంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. కూచిపూడి నృత్య ప్రదర్శన బుధవారం విజయవల్లి, శాంకరి నృత్య స్థలి బృందం సభ్యులు ప్రత్యేకంగా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పట్టణ ప్రజలు హాజరై కూచిపూడి నృత్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా నృత్య బృందం సభ్యులను ఈవో కె. వినోద్ రెడ్డి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.