రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం ఉదయం 10గంటలకు కూడా పొగమంచు ఉండడంతో సూర్యుడు రాలేదు. దీంతో వేములవాడ పట్టణ ప్రజలకు చలి తీవ్రత అధికమైందని వాపోతున్నారు. మంచు మేఘాలు కమ్ముకోవడంతో రోడ్లన్నీ మంచుతో దర్శనమిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు వాహనదారులు నియంత్రిత వేగంతో పొగమంచు నేపథ్యంలో వెళ్లాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు.