వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో బుధవారం పుట్టినరోజు నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఫుడ్ పంపిణీ చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాన్ వెజ్ ఫుడ్ ను కొందరు యాచకులు, నిరుపేదలు ఆలయ ప్రాంగణంలోకి తీసుకు వెళ్లి తిన్నారని, ఇక్కడ ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు. నాన్వెజ్ ఫుడ్ పంపిణీ చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.