రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బుధవారం రకరకాల మొక్కలను గ్రామ ప్రజలు యువకులు నాటడం జరిగింది. టేకోమో, రైన్ట్రీ, జామ, మందారం, గులాబీ, గన్నేరు మొదలగు మొక్కలను ప్రైమరీ స్కూల్ ఆవరణలో నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి వన సేవక్, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.