పాము కాటు.. నాటు వైద్యం చేటు

76చూసినవారు
పాము కాటు.. నాటు వైద్యం చేటు
పాముకాటు పసరు మందులు, మంత్రాలతో విషం తగ్గుతుందని కొందరు వాదిస్తుంటారు. ఇది నిజం కాదు. విషపు పాము కరిచినా నూటికి 30 నుంచి 50 సార్లు అవి మనిషిలోకి విషాన్ని ఎక్కించవు. ఈ కాట్లను ‘డ్రై బైట్స్‌’ అంటారు. ఇలాంటివారికి నాటు వైద్యం చేసినా, మంత్రం వేసినా, ఏ తంత్రమో చేసినా బతికి బట్టకడతారు. నిజంగా విషసర్పం కరిచినప్పుడు, ఒంట్లో విషం ప్రవహిస్తున్నప్పుడు యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఒక్కటే మందు. ఇది తప్ప మరేదీ విషాన్ని నిర్వీర్యం చేయలేదు.

సంబంధిత పోస్ట్