యుపిలోని నోయిడాకు చెందిన 18 ఏళ్ల వీధి వ్యాపారి సన్నీ కుమార్.. నీట్-యూజీ 2024 పరీక్షలో మొత్తం 720కి గానూ 664 మార్కులతో అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్శించాడు. తాజాగా అతడు ఆసక్తికర విషయలు పంచుకున్నాడు. మధ్యాహ్నం 2 గం.కు పాఠశాల ముగిసిన తర్వాత 4-5 గంటలు సమోసాలు అమ్మేవాడినని, రాత్రిపూట చదువుకునే వాడినని సన్నీ చెప్పాడు. కాగా, అతని గదికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అందులో గోడలన్నీ నోట్స్, స్టడీ మెటీరియల్స్ తో నిండిపోయి ఉన్నాయి.