న్యూ ఇయర్ రోజున ఉత్తరప్రదేశ్‌లోని ఓ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా తల్లి, నలుగురు చెల్లెళ్లను కొడుకు హోటల్‌కు తీసుకెళ్లి హతమార్చాడు. సమాచారం అందుకున్న లక్నో సెంట్రల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఆగ్రాకు చెందిన అర్హద్ (24)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతదేహాలను మార్చరీకి తరలించాలి. పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.