రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనుండగా.. ఆ రూట్లలో ట్రాఫిక్ నిబంధనలు, కంట్రోల్, పోలీస్ బందోబస్తుపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.