ఎస్పీ నేతకు 10 ఏళ్ల జైలు శిక్ష

62చూసినవారు
ఎస్పీ నేతకు 10 ఏళ్ల జైలు శిక్ష
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్‌కు రాంపూర్ కోర్టు గురువారం 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.14 లక్షల జరిమానా విధించింది. ఎస్పీ ప్రభుత్వ హయాంలో 2016 నాటి కేసుకు సంబంధించి ఆయనను దోషిగా తేల్చింది. దుంగార్‌పూర్ కాలనీ నివాసితులను కొట్టి, బలవంతంగా వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించడం, దోపిడీ, బెదిరించడం వంటి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్