ఉగాండాలో కొత్త రోగం ప్రజలను వణికిస్తోంది. దాని పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం.
కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియక అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. 300+ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది. జ్వరం, నరాల బలహీనత, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు.