ప్రేమకు కులం, మతం, జాతి, రంగు, వయసుతో సంబంధం లేదు. కానీ రియల్ లైఫ్‌లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్. 31 ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ 70 ఏళ్ల నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘నీ తండ్రి ఏజ్‌లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడటానికి సిగ్గు లేదా’ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. దీనిపై వారు స్పందించలేదు.