రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి. అదేవిధంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.75 శాతంగా నిర్ణయించారు.