చెప్పులు కుట్టుకుంటూ ఉన్న వ్యక్తికి సహాయం చేసిన ఎస్సై (వీడియో)

78చూసినవారు
AP: నందిగామ ఎస్సై బి. అభిమన్యు మానవత్వాన్ని చాటారు. నందిగామ పట్టణం మెయిన్ బజార్లో శ్యామ్ బాబు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఎండలో కూర్చొని చెప్పులు కుట్టడం ఎస్సై గమనించారు. వెంటనే అతనికి కోసం గొడుగు ఏర్పాటు చేశారు. చెప్పులు కుట్టే సామగ్రి అంతా చెల్లాచెదురుగా ఉండడం చూసి ఎస్సై స్వయంగా తానే ప్లైవుడ్ షాపుకు వెళ్లి టేబుల్ చేయించారు. చెప్పుల ఆసుపత్రి అని బోర్డు పెట్టి.. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్