శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9.17గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 175 కిలోల ఈవోఎస్-08 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. విపత్తు నిర్వహణలో ఇది పంపే సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఇక ఈ ప్రయోగం నేపథ్యంలో గురువారం ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.