తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తనని తాను బీరు సీసాతో పొడుచుకుంటూ భీభత్సం సృష్టించాడు. భయాందోళనలకు గురైన స్థానికులు యువకుడిని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.