వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ‘‘టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్‌లో డీఎస్పీ గేట్లు తెరిచారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మృతుల్లో ఒకరిని మాత్రమే గుర్తించాం. మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తానని సీఎం తెలిపారు’’ అని బీఆర్ నాయుడు వెల్లడించారు.