ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ తన ప్రేయసి ఆష్న ష్రాఫ్‌ను వివాహమాడాడు. గురువారం ఉదయం తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కాగా అర్మాన్ మాలిక్ తెలుగులో ఎన్నో పాటలు పాడాడు. ‘అల వైకుంఠపురం’ చిత్రంలోని బుట్ట బొమ్మ, ‘హలో’ చిత్రంలోని హలో పాటను, ‘తొలి ప్రేమ’ మూవీలో నిన్నిలా నిన్నిలా వంటి అనేక హిట్ పాటలను పాడాడు.