రెండు వెర్షన్లలో రాష్ట్ర గీతం.. జూన్ 2న విడుదల

50చూసినవారు
రెండు వెర్షన్లలో రాష్ట్ర గీతం.. జూన్ 2న విడుదల
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'ను జూన్ 2న రెండు వెర్షన్లలో ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 6 నిమిషాల నిడివి ఉండే ఈ గీతాన్ని పూర్తి నిడివితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా 60-90 సెకన్ల నిడివితో రూపొందించనున్నారు. అందెశ్రీ రచించిన ఈ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించనున్నారు. పాట రూపకల్పనపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో నిన్న వీరిద్దరూ భేటీ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్