ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా?

70చూసినవారు
ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా?
వేసవి కాలమైన సరే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల అలసట లేదా బలహీనత ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఏసీలు గదిలో తేమను మాయం చేస్తాయి. దీంతో తలనొప్పి, చర్మం డ్రై అవ్వటం, కళ్లు పొడిబారి, దురద పెట్టడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అలాగే అతిగా ఏసీలో ఉండే వారికి బయట వచ్చే వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయి.