ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చాలా మంది తడుస్తూనే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే తడిచిన దుస్తులతో ఎక్కువ సేపు ఉంటే అనారోగ్యాలు తలెత్తుతాయి. చర్మంపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటివి పేరుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు రావొచ్చు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చలి జ్వరం, జలుబు, దగ్గు కూడా వచ్చే ప్రమాదం ఉంది.