తెలంగాణలోని ఆదివాసీలకు స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించాలన్నారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని సూచించారు. 'అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకున్నాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం' అని తెలిపారు.