తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై సోమవారం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.