దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 102.93 పాయింట్లు పెరిగి 69,928.53 వద్ద, నిఫ్టీ 27.70 పాయింట్లు పెరిగి 20,997.10 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో UPL, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో,
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభపడగా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, BPCL, M&M నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39 వద్ద స్థిరపడింది.