యూపీలో దారుణ ఘటన వెలుగుచూసింది. అలీగడ్ జిల్లాలో ఓ యువకుడిని నలుగురు దుండుగులు కాల్చి చంపేశారు. హరీస్ (25) అనే యువకుడు తన స్నేహితుడితో వేచి ఉండగా బైకులపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతడిపై కాల్పులు జరిపారు. అతను తప్పించుకునే ప్రయత్నంలో కిందపడగా దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హరీస్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.