సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు

53చూసినవారు
సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ..ఇద్దరు వ్యోమగాములు దాదాపు 2 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. మైక్రో గ్రావిటీ, రేడియేషన్ ఎక్స్ పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.

సంబంధిత పోస్ట్