ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటితో క్విడ్‌ప్రోకో జరుగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిట్‌తో విచారణ జరిపించేందుకు నో చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో నిలిపివేయించిన విషయం తెలిసిందే.