భారత టీ20 నూతన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అత్యధిక సార్లు అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ అవార్డు అత్యధికంగా అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షకిబ్ అల్ హసన్, డేవిడ్ వార్నర్‌లతో కలిసి సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురు ఐదుసార్లు ఈ అవార్డు అందుకున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి (6 సార్లు) ఉన్నాడు.