విద్యుత్తు తీగ తెగిపడి రైతు మృతి
విద్యుత్తు తీగ తెగిపడి రైతు మృతి చెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్ మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంటు షాక్ కు గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు.