ప్రభుత్వ భూమి ఇంచు ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు గురువారం నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాల ఆక్రమణకు గురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో చండూరు మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఇంచు ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ భూములను కాపాడడానికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.