సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని స్కూల్ లో ఇంటర్మీడియట్ లో చేరేందుకుగానూ నేటి నుంచి ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 14 నుంచి 24వరకు అడ్మిషన్లు, 25న దరఖాస్తుల పరిశీలన, 26నుంచి 28వరకు సెలక్షన్ లిస్టు, 29 నుంచి 31వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని పేర్కొన్నారు.జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.