భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతిక తెలంగాణ రాష్ట్రం... రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ మంత్రి జగదీష్‌రెడ్డి

114చూసినవారు
భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతిక తెలంగాణ రాష్ట్రం... రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ మంత్రి జగదీష్‌రెడ్డి
సర్వమత సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చేది ఒక్క కేసీఆర్‌దే...
రంజాన్‌ పండుగ సందర్భముగా బట్టలు పంపీణీ సీఎం ఔధార్యానికి నిదర్శనం...

కోదాడ : భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతీకగా తెలంగాణ రాష్త్రాన్ని తీర్చిదిద్ది, దేశం యావత్తు తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన చేస్తున్నాడని, అన్ని మతాలను సమాన దృష్టితో చూసి, అన్ని మతాల సంస్కృతిని గౌరవించేందుకు తెలంగాణ సమాజంలోని అన్ని పండుగలను ధనిక, పేద లేకుండా నిర్వహించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రతి మతానికి దుస్తులు పంపీణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడని రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోదాడలోని ఆర్‌ఎస్‌వి పంక్షన్‌ హాల్లో రంజాన్‌ పండుగ సందర్భముగా ప్రభుత్వదుస్తుల పంపీణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై దుస్తులను పంపీణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లీంలు పవిత్రంగా భావించే రంజాన్‌ పండుగ రోజు ప్రతి ముస్లీం కుటుంబం పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్న లక్ష్యంతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మైనార్టీలను ఓటు బ్యాంకు వాడుకుంటున్నారే తప్ప వారికి సరైన గుర్తింపు ఇవ్వడంలేదన్నారు. దేశంలో ప్రస్తుతం మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్సిన్తున్నారని అన్నారు. ముస్లీంలు వెనుకబడి పోవడానికి కారణం విద్యలేని తనంగా గుర్తించి ముఖ్యమంత్రి కేసీర్‌ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు 200 గురుకులాలను ఏర్పాటు చేసి వారిలో విద్యను ప్రోత్సహించి వారిని అభివృద్ధి పధంలోకి తీసుకెళుతున్నారని అన్నారు. ఇంకా మైనార్టీల సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం వాటిని అర్హులైన మైనార్టీలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ సంపద అన్ని వర్గాలకు అందించాలన్న లక్ష్మ్యమే కేసీఆర్‌దని, దానిలో భాగంగానే అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తు వారికి అన్ని పథకాలు వర్తింపచేస్తున్నామన్నారు. కోదాడ ఆర్డీవో బిఓఆనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోకోదాడ మార్కెట్‌ చైర్మన్‌ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనితనాగరాజు, డీసీసీబి చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెలేయ వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి యెర్నేని వెంకటరత్నబాబు, జిల్లా గ్రంథాలయ అద్యక్షుడు వెంటేశ్వర్లు, ఎంపీపీలు మునిసిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కోదాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ముస్లీం పెద్దలు, వందలాది మంది ముస్లీంలు పాల్గొన్నారు. అనంతరం ఆయన కోదాడలోని ముస్లీల షాధిఖానాను, ఈద్గాను సందర్శించి వాటి పునర్మిణానికి నిధులు విడుదల చేస్తానని హామి ఇచ్చారు.

ట్యాగ్స్ :