గరిడేపల్లి మండలం కూతుబ్షాపురం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న మామిడి చంద్రమౌళి పిఎస్హెచ్ఎం గా పదోన్నతి పొందారు. నేరేడుచర్ల మండలం మేడారం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు స్వీకరించారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.