వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ ఇన్‌చార్జ్‌గా గోపి

84చూసినవారు
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్ర గోపి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్ర గోపి యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేసారు. అనంతరం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కై అనేక పోరాటాలు చేసిన కుర్ర గోపి యాదవ్ నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులవడం శుభపరిణామం అన్నారు.

సంబంధిత పోస్ట్