క్యాథలిక్ విశ్వాసులు సోదర భావంతో జీవించాలని హుజూర్ నగర్ సెయింట్ జోసెఫ్ చర్చ్ విచారణ గురువు ఫాదర్ మరయ్య తెలిపారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ లోని సెయింట్ జోసెఫ్ చర్చిలో దివ్య పూజ బలి సమర్పణ గావించారు. ఈ ఆరాధనలో సిస్టర్స్ గాలి సుందరి సుపీరియర్, బెల్లంకొండ పుష్ప, పెంటారెడ్డి పుష్ప, కుసుమ, గొలమారి బాలసుందరి, క్యాథలిక్ విశ్వాసులు పాల్గొన్నారు.