హుజూర్ నగర్ పట్టణం లో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బెన్ ఫిట్ షో టికెట్ల ను సాయిబాబా థియేటర్ మేనేజర్ సురేష్ టోకుగా అమ్ముకొని ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూడకుండా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారని సమాచార ఉద్యమకారుడు కంటు నాగరాజు ఆరోపించాడు. ఈ మేరకు హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో థియేటర్ యాజమాని పై ఫిర్యాదు చేశాడు. సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను అధికారులు అడ్డుకోవాలన కోరాడు.