కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరకు చెందిన సీపీఐ నాయకురాలు యలమద్ది తులసమ్మ (90) శుక్రవారం మృతి చెందారు. తులసమ్మ మృతదేహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తులసమ్మ పార్టీకి చేసిన సేవలను స్మరించుకున్నారు. మృతురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మేకల శ్రీనివాసరావు, మాతంగి ప్రసాద్, తదితరులు సంతాపం తెలిపారు.