తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కవులు కళాకారులు మేధావులు
విద్యార్థులు నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయ్యేవరకు తమ జీవితాలను కుటుంబాలను త్యాగం చేసి నాటి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి తెలంగాణ సాధించారని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి
కేసీఆర్ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.
తొలి దశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కత్రం సీతారామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామ రాజు, రాష్ట్ర కార్యదర్శి కే.చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలం, కోశాధికారి లక్ష్మీనారాయణ, వల్లూరు రామిరెడ్డి, చిలకముడి విశేశ్వరావు, కడారి వెంకటయ్య, నూకల లక్ష్మీ, పాదురీ రజిత, సరోజిని శాంత, మలిదశ ఉద్యమ కారులు వక్కవంతుల విజయ్ కుమార్, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, కుక్కడపు బాబు, అనంతుల మహేష్, పగడాల రామచంద్రారెడ్డి, కరుణాకర్, మజార్, అలీ, జడ్పీటీసీ ఉమా శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుల్లారెడ్డి, డాక్టర్ బ్రహ్మం, తిరుమలగిరి రాధాకృష్ణ, విజయ, మాతంగి శైలజ పలువురు తెలంగాణ తొలిదశ మలిదశ నాయకులు తదితరులు పాల్గొన్నారు.