జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్ తల్లి తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదని ఇటీవల ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ టీం స్పందించి కౌశిక్ ట్రీట్‌మెంట్‌కు రూ.12 లక్షలు కట్టి అతడిని డిశ్ఛార్జి చేయించారు. దీంతో కౌశిక్ తల్లి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ సర్.. నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. మా కుటుంబమంతా మీ అభిమానులమే’ అని చెప్పుకొచ్చారు.