పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను పక్కన పెడుతూ గతంలో పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్ ఫకర్ జమాన్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. కోహ్లీతో బాబర్‌ను పోల్చుతూ అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా అతడిపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంది. తాజాగా ఈ వివాదంపై ఫకర్ జమాన్ స్పందించాడు. అది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని తాను పీసీబీని విమర్శించలేదని చెప్పుకొచ్చాడు.