తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయిన దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్, బట్టేపు చిన్న సైదులు అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.