కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి

62చూసినవారు
కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి
కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గాంధీ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది సిలివేరు వెంకటేశ్వర్లు గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిడతల శ్రీను, లచ్చిమల్ల రామ్మోహన్ రావు, బండారు శ్రీనివాసరావు, ఎస్కే బాగ్దాద్, కామల్ల ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్